Homeతాజావార్తలుHyderabad | కారులో భారీగా నోట్ల కట్టలు.. 15 కిలోమీటర్లు ఛేజ్​ చేసి పట్టుకున్న పోలీసులు

Hyderabad | కారులో భారీగా నోట్ల కట్టలు.. 15 కిలోమీటర్లు ఛేజ్​ చేసి పట్టుకున్న పోలీసులు

కారులో తరలిస్తున్న నోట్ల కట్టలను పోలీసులు పట్టుకున్నారు. రూ.4 కోట్లు స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్ట్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | కారులో తరలిస్తున్న నోట్ల కట్టలను పోలీసులు పట్టుకున్నారు. కారు డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో కనిపించకుండా రూ.4 కోట్ల డబ్బును తరలిస్తుండగా.. పోలీసులు వారిని ఛేజ్​ (police chase) చేసి పట్టుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను నార్త్​ జోన్​ డీసీపీ రష్మీ పెరుమాళ్లు మీడియాకు వెల్లడించారు.

నిందితులు ప్రకాష్ ప్రజాపతి (30), ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతి (28) గతేడాది కొంతమందిని మోసం చేశారు. రూ.50 లక్షల నగదు ఇస్తే అదనంగా రూ.10 లక్షలు కలిపి ఆర్టీజీఎస్​ ద్వారా ట్రాన్స్​ఫర్ చేస్తామని నమ్మించారు. దీంతో వారు డబ్బులు ఇవ్వగా.. తర్వాత ఎలాంటి అమౌంట్​ ట్రాన్స్​ఫర్ చేయలేదు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై గత ఏడాది బోయిన్ పల్లి పీఎస్(Boynpally PS)లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇటీవల నిందితులను గుర్తించారు. వారు హైదరాబాద్​కు వస్తున్నట్లు తెలియడంతో పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితేని నిందితులు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు.

Hyderabad | మహబూబ్​నగర్​లో..

నిందితులు క్రెటా కారులో పారిపోతుండగా.. హైదరాబాద్​ పోలీసులు వారిని వెంబడించారు. శామీర్ పేట్ ORR నుంచి మహబూబ్ నగర్​ (Mahbubnagar) వారిని ఛేజ్​ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అడక్కల్ పోలీసుల సాయంతో నిందితులను పట్టుకున్నారు. అనంతరం కారులో తనిఖీలు చేయగా.. రూ.4.05 కోట్ల డబ్బు దొరికినట్లు డీసీపీ తెలిపారు. ఆ డబ్బును సీజ్​ చేశారు. అయితే ఆ నగదు ఎవరిది, ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.

Must Read
Related News