అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Police | యూట్యూబ్ ఛానెళ్ల (YouTube Chanels)కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. రెండు ఛానెళ్లపై పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు.
ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు రెచ్చిపోతున్నాయి. ఎవరిని పడితే వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పిచ్చి చేష్టలతో ఫేమస్ అయిన వారిని పిలిచి వీడియోలు తయారు చేస్తున్నారు. కొందరు మైనర్లు ప్రేమ పేరుతో రీల్స్ చేయగా.. వారిని సైతం కొన్ని ఛానెళ్ల వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలాంటి వారిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులకు, యువతకు ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేయాలని సూచించారు. మైనర్లతో అసభ్యకర కంటెంట్ తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా రెండు ఛానెళ్లపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Hyderabad Police | సీపీ వార్నింగ్తో..
పిల్లలతో అసభ్యకర వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడం బాలల హక్కుల ఉల్లంఘన అని సీపీ సజ్జనార్ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. దీంతో చాలా యూట్యూబ్ ఛానెళ్ల నిర్వాహకులు వీడియోలను డిలీట్ చేశారు. అయితే ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు తాజాగా రెండు ఛానెళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ (Cyber Crime Police) స్టేషన్‌లో పొక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఈ మేరకు సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘సోషల్‌మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని.. ఏ తరహా కంటెంట్ అయినా చేస్తామంటే కుదరదు. చట్టప్రకారం బాధ్యులపై కఠిన చర్యలను పోలీస్ శాఖ తీసుకుంటుంది” అని ఆయన హెచ్చరించారు.