అక్షరటుడే, బాన్సువాడ: Local Body Elections | బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి (Pocharam village) ప్రత్యేకత ఉంది. సుమారు 40ఏళ్లుగా ఈ పంచాయతీ ఏకగ్రీవ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తోంది.
Local Body Elections | ఈసారి ఇద్దరు నామినేషన్ వేయగా..
ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం గ్రామం నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామస్థుల్లో కొంత ఆసక్తి నెలకొంది. అయితే స్క్రూటినీలో ఒకరి నామినేషన్ తిరస్కరించబడడంతో పోటీ తిరిగి ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) స్వగ్రామం పోచారం 1984లో గ్రామపంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషితో ఏకగ్రీవం అవుతూ వస్తోంది. గ్రామస్థుల మధ్య పరస్పర అవగాహన, సహకారం కారణంగానే నాలుగు దశాబ్దాలుగా పోచారం గ్రామం ఏకగ్రీవ నిర్ణయాలకు వేదికవుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ కావడంతో యువకుడు రమేష్‌ను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Local Body Elections | ఇబ్రహీంపేట్ నుంచి పోచారం..
1984లో ఇబ్రహీంపేట్ నుంచి పోచారం గ్రామం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. అప్పుడు మొదలైన ఏకగ్రీవ ఎన్నికల (unanimous elections) సంప్రదాయం ఇప్పటికి నిరంతరంగా కొనసాగుతూ ఉండడం గ్రామ ఐక్యతకు ప్రతీకగా భావిస్తున్నారు. అభ్యర్థుల మధ్య కలహాలు లేకపోవడం, గ్రామ సమస్యలను కలిసి పరిష్కరించుకునే సంస్కృతి కొనసాగుతుండడం కూడా ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.