PM Modi | ప్రధాని మోదీకి ఉక్రెయిన్​ అధ్యక్షుడి ఫోన్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ (Ukrainian President Zelensky) సోమవారం ఫోన్​ చేశారు. రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine war)పై ప్రధానికి ఆయన వివరించారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్​ (Putin) సైతం మోదీకి ఫోన్​ చేసిన విషయం తెలిసిందే. యుద్ధం, రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. తాజాగా ఉక్రెయిన్​ అధ్యక్షుడు మోదీతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని జెలెన్‌స్కీ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ (Ukrainian President Zelensky) సోమవారం ఫోన్​ చేశారు. రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine war)పై ప్రధానికి ఆయన వివరించారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్​ (Putin) సైతం మోదీకి ఫోన్​ చేసిన విషయం తెలిసిందే. యుద్ధం, రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. తాజాగా ఉక్రెయిన్​ అధ్యక్షుడు మోదీతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

PM Modi | మద్దతు ఇవ్వాలి

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని భారత్​పై అమెరికా 50 శాతం సుంకాలు (US Tariffs) విధించిన విషయం తెలిసిందే. భారత్​ ఆయిల్, ఆయుధాలు దిగుమతి చేసుకుంటూ ఉండడంతో ఆ డబ్బును ఉక్రెయిన్​ యుద్ధంలో రష్యా వినియోగిస్తుందని డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి ఉక్రెయిన్​ అధ్యక్షుడు ఫోన్​ చేయడం గమనార్హం. రష్యా–ఉక్రెయిన్​యుద్ధాన్ని ముగించడానికి శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు. కాగా అమెరికాలో (America) ఈ నెల 15న రష్యా అధ్యక్షుడు పుతిన్​తో డోనాల్డ్​ ట్రంప్​ సమావేశం కానున్నారు. యుద్ధం విషయంలో ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. అయితే తాము లేకుండా శాంతి చర్చలు ఫలించవని జెలెన్​స్కీ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా మోదీతో మాట్లాడారు.

PM Modi | శాంతియుతంగా పరిష్కరించుకోవాలి

వివాదాన్ని త్వరగా, శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరంపై భారతదేశం స్థిరమైన వైఖరిని తెలియజేసినట్లు మోదీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా స్పందించారు. ఈ విషయంలో సాధ్యమైన ప్రతి సహకారాన్ని అందించడానికి, అలాగే ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...