Homeఅంతర్జాతీయంModi-Putin | పుతిన్ భారత్ పర్యటనలో అరుదైన దృశ్యం.. మోదీ కారులోనే ప్రయాణం

Modi-Putin | పుతిన్ భారత్ పర్యటనలో అరుదైన దృశ్యం.. మోదీ కారులోనే ప్రయాణం

రష్యా అధ్యక్షుడు పుతిన్‌, భారత ప్రధాని మోదీ మధ్య ఉన్న స్నేహం, పరస్పర నమ్మకం గురించి ప్రపంచం అంతటికీ తెలిసిందే. ఆ బంధానికి నిదర్శనంగానే పుతిన్ తన అత్యంత భద్రత కలిగిన “ఫ్లైయింగ్ ఆన్ వీల్స్” లిమోసిన్‌ను పక్కనపెట్టి, మోదీ కారులో ప్ర‌యాణించాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi-Putin | రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న రాత్రి భారత్‌ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్వయంగా ఘన స్వాగతం పలికారు.

విమానం దిగిన వెంటనే ఇద్దరూ కరచాలనం చేసుకుని, స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకోవడం ఆత్మీయతను మరింత స్పష్టంగా చూపించింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి పీఎం నివాసానికి వెళ్లేందుకు పుతిన్ (Vladimir Putin) తన ప్రత్యేక ఆర్మర్డ్ వాహనం కాకుండా, ప్రధాని మోదీ అధికారిక వాహనం టయోటా ఫార్చ్యూనర్‌లోనే ప్రయాణించడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా పుతిన్ ఎక్కడికైనా వెళ్లినప్పుడు తనతోపాటు అత్యంత భద్రత కలిగిన Aurus Senat Limousineను తీసుకెళ్తారు. దీనిని “ఫ్లైయింగ్ ఆన్ వీల్స్” (Flying On Wheels) అని కూడా పిలుస్తారు.

Modi-Putin | మోదీ ఎందుకు ఫార్చ్యూనర్ ఎంచుకున్నారు?

కానీ భారత్ పర్యటనలో ఆయన ఈ ఆచారాన్ని పక్కనపెట్టి మోదీ వాహనాన్ని ఎంచుకోవడం, రెండు దేశాల మధ్య ఉన్న విశ్వాసం, బలమైన బాంధవ్యాన్ని సూచిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యేకించి భద్రత విషయంలో అత్యంత కఠినమైన విధానాలు పాటించే పుతిన్ తన కారును వదిలేయడం చాలా అరుదుగా జరుగుతుంది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ప్రధాని మోదీ సాధారణంగా వాడే విలాసవంతమైన Range Rover Sentinelను కాకుండా, టయోటా ఫార్చ్యూనర్‌ వాహనాన్ని ఉపయోగించి పుతిన్‌ను పీఎం నివాసానికి తీసుకెళ్లడం చర్చకు దారి తీసింది.

ఈ ఫార్చ్యూనర్ ప్రత్యేకతలు ఏంటంటే ..సిగ్మా 4 MT మోడల్, MH01EN5795 రిజిస్ట్రేషన్ నంబరు, బీఎస్-6 నార్మ్స్ కి అనుగుణంగా తయారు అయింది. 2024 ఏప్రిల్‌లో ఈ కారు రిజిస్టర్‌ అయ్యింది. సమాచారం ప్రకారం ధర సుమారు ₹4.5 మిలియన్లు ఉంటుంద‌ట‌. అత్యాధునిక భద్రతా ఫీచర్లు కలిగిన కొత్త SPG వాహనాల సముదాయంలో భాగంగా ఈ కారు ఉండ‌గా, 2039 ఏప్రిల్ వరకు చెల్లుబాటుగా ఉంటుంది. ఈ వాహనం అత్యుత్తమ స్థాయి సెక్యూరిటీ మాడిఫికేషన్స్ (Security Modifications) కలిగి ఉండడం వల్లే దీన్ని ఎంచుకున్నారని సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. అయితే భారత్ పర్యటనలో పుతిన్ ఇలాంటి అరుదైన నిర్ణయం తీసుకోవడం, రెండు దేశాల మైత్రి, విశ్వాసం, శక్తివంతమైన వ్యూహాత్మక సంబంధాలను మరోసారి రుజువు చేసింది. ఒకే కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, భారతీయ దౌత్య పరిమళాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాయి.

Must Read
Related News