31
అక్షరటుడే, ముప్కాల్ : CM Cup | గ్రామీణస్థాయిలో క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయస్థాయిల్లో రాణించాలని సర్పంచ్ లావణ్య భూమేశ్వర్ (Sarpanch Lavanya Bhumeshwar) అన్నారు. మండలంలోని రెంజర్ల గ్రామంలో (Renjerla Village) సీఎం కప్లో భాగంగా క్రీడాపోటీలను సర్పంచ్ సోమవారం ప్రారంభించారు.
CM Cup | క్రీడలకు సహకారం..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత చెడుఅలవాట్లకు దూరంగా ఉండేందుకు క్రీడలవైపు మొగ్గు చూపాలన్నారు. తమ ప్రతిభతో క్రీడల్లో రాణించి గ్రామానికి మంచిపేరు తేవాలని సూచించారు. గ్రామ యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని ప్రతిభను ప్రదర్శించాలని వక్తలు సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేందర్, కాంగ్రెస్ పార్టీ (Congress Party) మండల అధ్యక్షుడు ముత్యం రెడ్డి, ఎంఈవో రవికుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
