అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kothagudem Railway Station | రైల్వే స్టేషన్‌లో నాటుబాంబు పేలడంతో (bomb Blast) ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో (Bhadradri Kothagudem railway station) బుధవారం చోటు చేసుకుంది.
రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచులు వదిలి వెళ్లారు. అందులో ఉల్లిగడ్డ పరిమాణంలో ఏడు నాటు బాంబులు ఉన్నాయి. తినే పదార్థం అనుకొని ఓ కుక్క బాంబును కొరికింది. దీంతో అది పేలి కుక్క అక్కడిక్కడే చనిపోయింది. ఈ ఘటనతో స్టేషన్‌లో ఉన్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులు (Passengers) బయటకు పరుగులు తీశారు.
Kothagudem Railway Station | పోలీసుల తనిఖీ
సమాచారం అందుకున్న కొత్తగూడెం మూడో టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మిగతా సంచులను పరిశీలించారు. ఆరు నాటు బాంబులను (plant bombs) స్వాధీనం చేసుకున్నారు. ఉదయం వెళ్లే రైలులో నాటు బాంబులను తరలించేందుకు ఎవరో ప్రయత్నించి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
