అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America | అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం (Florida State) బ్రెవర్డ్ కౌంటీలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఒక అరుదైన ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది. ఇంటర్ స్టేట్–95 (I-95) జాతీయ రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న కారును ఒక చిన్న విమానం ఢీకొట్టింది.
ఈ ఘటనలో భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తు పెద్ద ప్రాణనష్టం తప్పింది. సాక్షుల ప్రకారం సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ (Brevard County)లోని I-95 హైవేపై ట్రాఫిక్ సామాన్యంగానే కొనసాగుతోంది. ఈ సమయంలో ఒక సింగిల్-ఇంజిన్ చిన్న విమానం గాల్లోనే సమస్యలు ఎదుర్కొంది.
America | ప్రమాదం తప్పింది..
పైలట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం చేస్తున్నప్పుడే, విమానం నియంత్రణ కోల్పోయి నేరుగా హైవేపై దూసుకెళ్తున్న కారుపై పడింది.హఠాత్తుగా పై నుంచి విమానం దూసుకొస్తున్న దృశ్యం చూసిన వాహనదారులు భయంతో షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒక మహిళకు మాత్రమే స్వల్ప గాయాలు అయ్యాయి. ఆ కారులోని మిగతా వారు సేఫ్‌గా బయటపడ్డారు. విమానంలో ఉన్న పైలట్, ప్రయాణికుడు ఇద్దరూ ప్రాణాలతో బయటపడడం అద్భుతం అని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రక్షణచర్యలు చేపట్టారు.
విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing)కు ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చింది అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం టుడే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరిన విమానం టేకాఫ్ కొద్ది నిమిషాల్లోనే టెక్నికల్ ఇష్యూ ఎదుర్కొంది. దీంతో పైలట్ సమీపంలోని సీజేఫ్ ఏరియాను వెతుకుతూ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నించాడు. ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోవడంతో కారును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఫ్యూడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) మరియు నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించాయి. ఈ అరుదైన ప్రమాదం జరిగిన సమయంలో, కారు వెనుక వస్తున్న మరో వాహనానికి అమర్చిన డాష్‌క్యామ్ మొత్తం ఘటనను రికార్డు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగానే లక్షలాది వ్యూస్ రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
“And boom… front tire just goes right onto the car that’s right in front of us. It was so scary.”
Jaw-dropping video of the I95 Plane Crash– @MeghanMoriarty_ talks with the videographer at 4 on @wesh. pic.twitter.com/LuxVoXSNs4
— Mike Hanson (@MikeWESH_2) December 9, 2025