Homeటెక్నాలజీRealme C71 | తక్కువ ధరలో ఏఐ ఫీచర్స్‌తో ఫోన్‌.. న్యూ మోడల్‌ను రిలీజ్‌ చేసిన...

Realme C71 | తక్కువ ధరలో ఏఐ ఫీచర్స్‌తో ఫోన్‌.. న్యూ మోడల్‌ను రిలీజ్‌ చేసిన రియల్‌మీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Realme C71 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ అయిన రియల్‌మీ(Realme) తన వినియోగదారుల కోసం మరో మోడల్‌ ఫోన్‌ను తీసుకువచ్చింది. తక్కువ ధరలో ఏఐ ఫీచర్స్‌(AI features)తో C71 మోడల్‌ను రిలీజ్‌ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)తో పాటు రియల్‌మీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. బడ్జెట్‌ ధరలో శక్తిమంతమైన ప్రాసెసర్‌తో తీసుకువచ్చిన ఈ మోడల్‌ వివరాలిలా ఉన్నాయి.

డిస్‌ప్లే:6.75 ఇంచ్‌ హెచ్డీ + ఎల్సీడీ డిస్‌ప్లే, 90 Hz రిఫ్రెష్‌ రేట్‌తో తీసుకువచ్చారు. ఆర్మర్‌ షెల్‌ ప్రొటెక్షన్‌, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, IP54 వాటర్‌ అండ్‌ డస్ట్‌ రెసిస్టన్స్‌ సామర్థ్యం కలిగి ఉంది.

ప్రాసెసర్‌:ఈ స్మార్ట్‌ ఫోన్‌లో Unisoc T7250 ఆక్టాకోర్‌ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

సాఫ్ట్‌వేర్‌:ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0(Realme UI 6.0) ఆపరేటింగ్‌ సిస్టం కలిగి ఉంది.

కెమెరా సెటప్‌:వెనుకవైపు 13 మెగాపిక్సెల్‌ మెయిన్‌ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్‌ మోనో క్రోమ్‌ కెమెరాతో కూడిన డ్యూయల్‌ కెమెరా సెట్‌ అప్‌ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా అమర్చారు. ఏఐ ఎరేజర్‌(AI eraser), ప్రొ మోడ్‌, క్లియర్‌ ఫేస్‌, డ్యుయల్‌ వ్యూ వంటి ఎడిటింగ్‌ ఫీచర్లున్నాయి.
సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంది.

బ్యాటరీ:6300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 15 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

అదనపు ఫీచర్లు:ఈ మోడల్‌ 300 శాతం అల్ట్రా వాల్యూమ్‌ మోడ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. దీనికోసం ప్రత్యేక అల్గారిథంను వినియోగిస్తుంది.
కాలింగ్‌ సమయంలో బ్యాక్‌ గ్రౌండ్‌ నాయిస్‌ను తగ్గించేందుకు ఏఐ కాల్‌ నాయిస్‌ డిడక్షన్‌ 2.0 ఫీచర్‌ అందుబాటులో ఉంది.

వేరియంట్స్‌:బ్లాక్‌, సీ బ్లూ కలర్స్‌లో లభిస్తోంది.
బేస్‌ వేరియంట్‌ అయిన 4 GB ర్యామ్‌ + 64 gb ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7699
6 GB ర్యామ్‌ + 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8,699.

Must Read
Related News