అక్షరటుడే, వెబ్డెస్క్ : Rubicon Research Ltd IPO | ఫార్మాస్యూటికల్ సెక్టార్‌కు చెందిన రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్ ఐపీవో(IPO)కు వస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,377.50 కోట్లు సమీకరించనుంది. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 80గా ఉంది.
రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్(Rubicon Research Ltd)ను 1999లో స్థాపించారు. ఇది విభిన్నమైన ఫార్ములేషన్ల అభివృద్ధి, తయారీ మరియు వాణిజ్యీకరణలో నిమగ్నమైన ఒక ఔషధ సంస్థ. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్(US)లో నియంత్రిత మార్కెట్లలో బలమైన ఉనికిని కలిగి ఉంది. ఈ కంపెనీ భారతదేశం మరియు కెనడా(Canada)లో యూఎస్‌ఎఫ్‌డీఏ(యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) తనిఖీ చేసిన రెండు ఆర్‌అండ్‌డీ(R&D) సౌకర్యాలను, భారతదేశంలోని రెండు తయారీ ప్లాంట్‌లను నిర్వహిస్తోంది. ఇది యూఎస్‌ఎఫ్‌డీఏ(USFDA), డబ్ల్యూహెచ్‌వో జీఎంపీ (ప్రపంచ ఆరోగ్య సంస్థ – మంచి తయారీ పద్ధతులు) మరియు హెల్త్ కెనడా వంటి ప్రపంచ నియంత్రణ సంస్థల నుంచి అక్రెడిటేిషన్‌లను కలిగి ఉంది.
Rubicon Research Ltd IPO | రుణభారం తగ్గించుకోవడానికి..
రూబికాన్ రీసెర్చ్ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 1,377.50 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వస్తోంది. ఇందులో రూ. 500 కోట్లు ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించనుండగా.. రూ. 877.50 కోట్లు ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా సమీకరించనున్నారు. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయంలో రూ. 310 కోట్లను రుణాలను తిరిగి చెల్లించడానికి, రూ. 190 కోట్లను వివిధ అవసరాలకోసం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Rubicon Research Ltd IPO | లాక్‌ఇన్ పీరియడ్..
యాంకర్ ఇన్వెస్టర్లకు సంబంధించి 50 శాతం షేర్ల లాక్‌ఇన్ పీరియడ్ 30 రోజుల తర్వాత ముగుస్తుంది. మిగిలిన షేర్ల లాక్‌ఇన్ పీరియడ్ 90 రోజుల తర్వాత పూర్తవుతుంది.
Rubicon Research Ltd IPO | ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్..
ఒక్కో ఈక్విటీ షేరు(Equity share) ధరను రూ. 461 నుంచి రూ. 485గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 30 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,550 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్‌ల కోసం బిడ్ వేయవచ్చు.
Rubicon Research Ltd IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీ(QIB)లకు 75 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) రూ. 80 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 16 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం : అక్టోబర్ 9
ముగింపు : అక్టోబర్ 13
అలాట్‌మెంట్ : అక్టోబర్ 14
లిస్టింగ్ తేదీ : అక్టోబర్ 16 వ తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతుంది.