Homeతాజావార్తలుNew Year Celebration | న్యూ ఇయర్​ వేడుకలకు అనుమతి తీసుకోవాల్సిందే.. పోలీసుల మార్గదర్శకాలు

New Year Celebration | న్యూ ఇయర్​ వేడుకలకు అనుమతి తీసుకోవాల్సిందే.. పోలీసుల మార్గదర్శకాలు

న్యూ ఇయర్​ వేడుకలపై పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందస్తుగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : New Year Celebration | కాలగర్భంలో మరో సంవత్సరం కలిసి పోనుంది. 2025లో మరో 29 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ప్రజలు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరో 29 రోజుల్లో 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో హైదరాబాద్​ (Hyderabad) సహా రాష్ట్రంలోని పలు నగరాల్లో కొత్త సంవత్సర వేడులకు నిర్వహించడానికి పలువురు ప్లాన్​ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారికి కీలక సూచనలు చేశారు. న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ కోసం అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేశారు.

New Year Celebration | హైదరాబాద్​ నగరంలో..

ప్రతి ఏటా హైదరాబాద్​ నగరంలో న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు సంస్థలు ఈవెంట్లు ఏర్పాటు చేస్తాయి. ఈ క్రమంలో న్యూ ఇయర్‌ ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరని సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad Police) స్పష్టం చేశారు. సైబరాబాద్‌ పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్‌ 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న వారికి మాత్రమే అనుమతులు ఇస్తామన్నారు. పార్టీలు, డీజే ఈవెంట్లు, పబ్ ప్రోగ్రామ్స్, ఫైర్‌వర్క్స్, రోడ్ షోలు వంటి అన్ని కార్యక్రమాలకు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

New Year Celebration | డ్రగ్స్​పై నిఘా అవసరం

హైదరాబాద్​ నగరంలో ఇటీవల డ్రగ్స్​, గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది. యువత వీటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్​ పార్టీ (New Year Party)ల్లో డ్రగ్స్​, గంజాయిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే మద్యం మత్తులో పలువురు రోడ్లపై హంగామా చేస్తారు. ఇలాంటి వాటిని సైతం నివారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Must Read
Related News