అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | స్కానింగ్ సెంటర్లకు (scanning centers) అనుమతి తప్పనిసరి అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ శ్రీ (District Medical and Health Officer Raja Sri) అన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ జిల్లాస్థాయి సలహా సంఘ సమావేశం జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి స్కానింగ్ కేంద్రం తప్పకుండా రిజిస్టర్ అయి ఉండాలన్నారు. అలాగే స్కానింగ్ యంత్రాల (scanning machines) మోడల్, సీరియల్ నంబర్ సర్టిఫికెట్లో నమోదు చేయాలన్నారు. ఒకవేళ వైద్యుడు లేదా సెంటర్ చిరునామా మారితే తప్పకుండా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వివరాలు తెలపాలన్నారు. అలాగే స్కానింగ్ కేంద్రాలకు వచ్చేవారికి తాగునీటి సదుపాయం, వాష్ రూం సౌకర్యాలు తప్పని సరిగా కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పిల్లల వెద్య నిపుణులు ప్రసన్న, డాక్టర్లు ఇందు, శ్వేత, సుప్రియ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
