Homeజిల్లాలునిజామాబాద్​NMC Nizamabad | డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే ధన్​పాల్​

NMC Nizamabad | డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే ధన్​పాల్​

డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నాగారంలోని డంపింగ్ యార్డును మంగళవారం పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : NMC Nizamabad | డంపింగ్ యార్డు సమస్యను శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) పేర్కొన్నారు. నాగారంలోని డంపింగ్ యార్డు​ను మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బయో మైనింగ్ (Bio Mining) ద్వారా చెత్తను శుభ్రపర్చే పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం డంపింగ్​ యార్డులో చెత్త సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. డంపింగ్ యార్డు​లో (Dumping Yard) పేరుకుపోయిన చెత్త వల్ల పరిసరాలకు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.

బయో మైనింగ్ పద్ధతిలో భాగంగా పాత చెత్తను వేరుచేసి, శుభ్రపర్చి తిరిగి ఉపయోగించుకునేలా చేయడం జరుగుతుందన్నారు. మొత్తం 3,51,500 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధిచేసే ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. ప్రస్తుతం రెండు మిషన్లు పనిచేస్తుండగా.. అదనంగా మరో రెండుమిషన్లు అవసరమవుతాయని త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు (BJP Leaders) ఇల్లెందుల ప్రభాకర్, మున్సిపల్​ అధికారులు ఉన్నారు.

Must Read
Related News