అక్షరటుడే, బోధన్: Flag march | పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas) పేర్కొన్నారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు బోధన్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాలూరలో శుక్రవారం పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించడం.. భయం లేకుండా ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఈ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Flag march | శాంతిభద్రతలు కాపాడుతూనే..
సమాజంలో శాంతిభద్రతలు కాపాడుతూనే.. ఓటుహక్కుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని బోధన్ ఏసీపీ పేర్కొన్నారు. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలందరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి, ఎన్నికల నియమాలను పాటించాలన్నారు.
ఎన్నికల సమయంలో గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడడం లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లాగ్‌మార్చ్‌లో బోధన రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, ఎడపల్లి ఎస్సై రమ, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
