అక్షరటుడే, ఆర్మూర్: Dussehra holidays | దసరా (Dussehra) సందర్భంగా పట్టణవాసులు తమ సొంతూళ్లలో పండుగను ఆనందంగా జరుపుకున్నారు. బంధువులను కలుసుకుని సంబురంగా గడిపారు. ఇక ఆదివారంతో సెలవులు ముగిశాయి. దీంతో ఉదయం నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ప్రజలు వెళ్తున్నారు.
Dussehra holidays | టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జాం..
పల్లెలు, పట్టణాల నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) ప్రజలు తిరుగుముఖం పట్టడంతో ఇందల్వాయి(Indalwai), భిక్కనూరు(Bhiknoor toll plaza) టోల్‌ప్లాజాల వద్ద విపరీతమైన వాహనాల రద్దీ నెలకొంది. టోల్‌ప్లాజా వద్ద కార్ల, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల నుంచి అధికంగా ప్రజలు హైదరాబాద్‌కు తరలివెళ్తున్నారు. దీంతో 44వ జాతీయ రహదారి సందడిగా మారింది.