అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా పెంట దత్తాద్రి విజయం సాధించారు. ఆదివారం నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో సంఘం ఎన్నికల పోలింగ్ నిర్వహించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. అర్ధరాత్రి తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో మూడు ప్యానెళ్లు పోటీ పడ్డాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా పెంట దత్తాద్రి, ప్రధాన కార్యదర్శిగా చౌకి భూమేశ్వర్, కోశాధికారిగా మోర సాయిలు విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా మురళి, దుబ్బరాజం బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా అవధూత రాములు, సుభాష్, బూస రవి, ప్రచార కార్యదర్శిగా శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా కస్తూరి గంగరాజు గెలిచారు. విజయం సాధించిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి గంగా ప్రసాద్ ధ్రువపత్రాలు అందజేశారు.