Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | పెండింగ్​ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: సీపీ సాయిచైతన్య

Nizamabad CP | పెండింగ్​ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: సీపీ సాయిచైతన్య

పోలీస్​స్టేషన్లలో పెండింగ్​లో ఉన్న కేసులను త్వరిగా పరిష్కరించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Nizamabad CP | ఆయా పోలీస్​స్టేషన్లలో పెండింగ్​లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో శుక్రవారం నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోక్సో, గ్రేవ్​ కేసుల్లో (POCSO and Grave cases) వేగంగా ఇన్వెస్టిగేషన్​ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

డివిజన్​ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలన్నారు. గంజాయి, పేకాట, పీడీఎస్​ బియ్యం (gambling and PDS rice) అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సైబర్​ నేరాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని.. సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేలా చూడాలన్నారు.

Nizamabad CP | రోడ్డు ప్రమాదాల నివారణకు..

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులపై ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు.

పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు నుంచి ఛార్జీషీట్​ వరకు ప్రతి విషయాన్ని కూలంకుశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో నిర్లక్ష్యం తగదన్నారు. ప్రతి అధికారికి సీసీటీఎన్​ఎస్​పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇన్వెస్టిగేషన్​, స్టేషన్​ మేనేజ్​మెంట్​ తెలిసి ఉండాలని సూచించారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేయాలని సూచించారు.

Nizamabad CP | సైబర్​ నేరాలపై అవగాహన కల్పించాలి

గ్రామ పోలీస్ అధికారులు (Village Police Officers) (వీపీవో) ప్రతిరోజూ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకం కావాలని సీపీ సూచించారు. నేర నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ముందుకెళ్లాలన్నారు.

సైబర్ క్రైం, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్​లైన్​ మోసాలకు (online fraud) గురయితే 1930కు కాల్ చేసి లేదా ఎన్​సీఆర్​పీ లేదా https://www.cybercrime.gov. లో ఫిర్యాదు చేయాలన్నారు.

Nizamabad CP | బ్లాక్​స్పాట్లను గుర్తించాలి..

రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించాలని సీపీ సూచించారు. హైవే రోడ్లను కలుపుతూ వెళ్లే లింక్ రోడ్లకు స్పీడ్ బ్రేకర్లను వేయించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్నారు. రోడ్ల విషయంలో ఇంజినీరింగ్ లోపాలు ఉన్నట్లయితే నేషనల్ హైవే (National Highways), స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రతిరోజూ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకన్ డ్రైవ్ టెస్ట్​లు నిర్వహించాలని సూచించారు. ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపడం లాంటి వాటిపై ప్రత్యేకదృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. క్రమం తప్పకుండా నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీయాక్ట్​ ప్రయోగించాలని ఆదేశించారు.

సమీక్షలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ ఎస్​హెచ్​వో వెంకట్ నారాయణ, రుద్రూర్ సీఐ కృష్ణ, బోధన్ రూరల్ ఎస్సైలు మచ్చేందేర్, ఎడపల్లి ఎస్సై రమ, రెంజల్​ ఎస్సై చంద్రమోహన్, కోటగిరి ఎస్సై సునీల్, రుద్రూర్ ఎస్సై సాయన్న, వర్ని ఎస్సై రామరాజు, సీసీఆర్​బీ ఇన్​ఛార్జి ఇన్​స్పెక్టర్​ రమేష్​ తదితరులు పాల్గొన్నారు.