Homeజిల్లాలునిజామాబాద్​DCC Nizamabad | పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్​కు సన్మానం

DCC Nizamabad | పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్​కు సన్మానం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: DCC Nizamabad | పీసీసీ పదవులను కాంగ్రెస్​ పార్టీ ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నగరానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్​కు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడుగా (PCC Disciplinary Committee) రామకృష్ణకు పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలో వారిని జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్మానించారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (Manala Moahan Reddy), కాంగ్రెస్ నగరాధ్యక్షుడు కేశ వేణు(Kesha venu) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నగరాధ్యక్షుడు కేశ వేణు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు దక్కడం సంతోషంగా ఉందన్నారు. వారికి పదవులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.

DCC Nizamabad | కష్టపడ్డ వారికి పదవులు

కాంగ్రెస్​ పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని మోహన్​రెడ్డి, కేశ్​ వేణు అన్నారు. ఇందుకు నిదర్శనం వారికి పదవులు దక్కడమేనన్నారు. పార్టీ నమ్మకంతో వీరికి పదవులు కట్టబెట్టిందని పేర్కొన్నారు. పార్టీ నమ్మకాన్ని కాపాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విధంగా పనిచేయాలని వారికి సూచించారు.

ఈ సందర్భంగా రాంభూపాల్, రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాపై నమ్మకంతో ఈ పదవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్​ అంతరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ(Market Committee) ఛైర్మన్​ ముప్ప గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, జిల్లా సేవాదళ్ నాయకులు సంతోష్, నవాజ్, ప్రీతం, మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, మాజీ కార్పొరేటర్ విజయ, కొండపాక రాజేష్, లవంగ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

రాంభూపాల్​ను సన్మానిస్తున్న మానాల మోహన్​ రెడ్డి, కేశ వేణు తదితరులు

Must Read
Related News