Homeఆంధప్రదేశ్Perni Nani | పవన్​ కల్యాణ్​ సినిమాలు మ్యాట్నీకే ఎత్తేస్తారు.. మాజీ మంత్రి నాని సంచలన...

Perni Nani | పవన్​ కల్యాణ్​ సినిమాలు మ్యాట్నీకే ఎత్తేస్తారు.. మాజీ మంత్రి నాని సంచలన వ్యాఖ్యలు

పవన్​ కల్యాణ్​ సినిమాలను విడుదలైన రోజు మ్యాట్నీకే ఎత్తేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఆయన సినిమాలను చూడటం జనం మానేశారన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Perni Nani | పవన్​ కల్యాణ్​ సినిమాలను విడుదలైన రోజు మ్యాట్నీకే ఎత్తేస్తారని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పేర్ని నాని (YSRCP leader Perni Nani) ఎద్దేవా చేశారు. వైఎస్సార్​సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ (AP Deputy CM Pawan) ఇటీవల తెలంగాణ వాళ్ల దిష్టి తగలడంతో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై తెలంగాన సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పందించారు. పవన్​ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఆడనివ్వమన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా పేర్ని నాని స్పందించారు. కోమటిరెడ్డి ఒక పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి అన్నారు. పవన్​ సినిమాలను మంత్రి ఆపాల్సిన అవసరం లేదన్నారు. మూవీ రిలీజ్​ అయిన రోజు మధ్యాహ్నానికే థియేటర్లలో నుంచి ఎత్తేస్తారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రజలే ఆయన సినిమాలు చూడటం లేదని ఎద్దేవా చేశారు.

Perni Nani | జీఎస్టీ కట్టలేదు

పవన్ సినిమా కొనుక్కున్న వాళ్ళు బికారులు అయిపోయారని పేర్ని నాని అన్నారు. పవన్ సినిమా నిర్మాత ప్రభుత్వానికి జీఎస్టీ కూడా కట్టలేదని ఆరోపించారు. ఒక్క అధికారి కూడా దీని గురించి అడగలేదన్నారు.

Perni Nani | చంద్రబాబు జీతం తీసుకోలేదా..

వైసీపీ 11 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం తీసుకొని రావడం లేదని ఇటీవల స్పీకర్​, టీడీపీ నాయకులు విమర్శించిన విషయం తెలిసిందే. వారిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్​ ప్రకటించారు. ఈ విమర్శలపై నాని స్పందించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదని గుర్తు చేశారు. ఆయన కూడా ప్రజల సొమ్ము జీతంగా తీసుకోలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తనపై నమోదయిన కేసుల నుంచి తప్పించుకోవడానికి ఫిర్యాదు దారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. హెల్త్ గ్రౌండ్స్ తో బెయిల్ తెచ్చుకుని కనీసం ఒక్కసారైనా ఆసుపత్రికి వెళ్లారా అని ప్రశ్నించారు.

Must Read
Related News