అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ (Telangana)లో సినిమాలు ఆడనివ్వమన్నారు.
పవన్ కల్యాణ్ ఇటీవల కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా తెలంగాణ ప్రజల నరదిష్టి తగలడంతో కొబ్బరి చెట్లు ఎండిపోయాయని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పందించారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు ఆడనివ్వమన్నారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమన్నారు. పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైన ఆడుతాయన్నారు. చిరంజీవి సూపర్ స్టార్ అని ఆయన మంచోడన్నారు. రాజకీయ అనుభవం లేకే పవన్ ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan | మైలేజ్ కోసం కామెంట్లు..
తెలంగాణ అభివృద్ధి చూసి పవన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) అన్నారు. మెచ్యూరిటీ లేకుండా పవన్ మాట్లాడుతున్నారని ఆగ్రమం వ్యక్తం చేశారు. మైలేజ్ కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. లేదంటే భవిష్యత్‌లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచేలా ఆయన మాటలు ఉన్నాయన్నారు.
Pawan Kalyan | తరిమి కొడతాం
పవన్ కల్యాణ్‌ను గెలిపించడంతోనే గోదావరి జిల్లాలకు దిష్టి తగిలిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. పవన్‌ను తెలంగాణ నుంచి తరిమి కొడతామని ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవకాశవాది లాగా, అనాలోచిత ప్రకటనలు చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
