అక్షరటుడే, భీమ్గల్ : Bheemgal | మండల కేంద్రంలో పాస్టర్ అసోసియేషన్ (Pastor Association) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి హాజరైన పాస్టర్లు ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు.
Bheemgal | కార్యవర్గం ఇదే..
గౌరవ అధ్యక్షుడిగా డి. శామ్యూల్, అధ్యక్షులుగా బోయిడి సుధాకర్, ఉపాధ్యక్షులుగా మోహన్ పాల్, ప్రధాన కార్యదర్శిగా ఫిలోమోన్, సహాయ కార్యదర్శిగా టైటాస్, కోశాధికారిగా నెల్సన్, గౌరవ సలహాదారులుగా డేవిడ్, జీవరత్నం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సుధాకర్ (Boidi Sudhakar) మాట్లాడుతూ.. పాస్టర్ల సంక్షేమానికి, ఐక్యతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ఆధ్యాత్మిక విలువలను కాపాడుతూ, సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సీనియర్ పాస్టర్లు, సభ్యులు ఘనంగా సన్మానించారు.