Homeజిల్లాలునిజామాబాద్​MLA Dhanpal | పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలి

MLA Dhanpal | పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలి

పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని నిజామాబాద్​ అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ అన్నారు. ఈ మేరకు నగరంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : MLA Dhanpal | ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ (MLA Dhanpal) సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో (Party Office) అర్బన్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ బలపడేది కార్యకర్తల అంకిత భావంతోనేనని అన్నారు..
కేంద్ర ప్రభుత్వం (Central Government) అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బూత్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ అంతర్గత క్రమశిక్షణ, ఐక్యత, ప్రజల్లో విశ్వాసం మరింత పెంచడంలో కలిసి పని చేయాలని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, పోతనకర్ లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు రాజు, జిల్లా కార్యదర్శి జ్యోతి, వీరేందర్, మండల అధ్యక్షులు తారక్ వేణు, ఆనందరావు, కిషోర్, రాజు, కోడూరు నాగరాజు, భూపతి తదితరులు పాల్గొన్నారు.