అక్షరటుడే, వెబ్డెస్క్:Parle G Biscuit | పార్లేజీ బిస్కెట్ గురించి మన దేశంలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఈ బిస్కెట్‌ని ఎంతో ఇష్టంగా తింటారు. పార్లే-జీ(parle biscuit) చౌకగా లభించే తినుబండారాల్లో బిస్కట్ ఒకటి. అయితే, యుద్ధంతో ఛిన్నాభిన్నమై, తీవ్ర ఆహార కొరతతో కరువు కోరల్లో చిక్కుకున్న గాజా(Gaza)లో ఇదే పార్లేజీ బిస్కెట్లు ఏకంగా 500 రెట్లు అధిక ధరకు అమ్ముడవుతుండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గాజా నుంచి ఇటీవల వైరల్ అయిన ఒక పోస్టులో, ముంబై కేంద్రంగా పనిచేసే పార్లే ప్రొడక్ట్స్ తయారుచేసిన పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ 24 యూరోలకు(సుమారు రూ. 2,342) పైగా అమ్ముడవుతోందని ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
చౌకైన ఆహార పదార్థం అంత ఎక్కువ ధరకు అమ్ముతుండడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి తన సోషల్ మీడియా పేజ్‌లో చాలా కాలం నిరీక్షణ తర్వాత, రఫీఫ్‌కు ఇష్టమైన బిస్కెట్లను Biscuits నేను సంపాదించగలిగాను అని చెప్పాడు. వాటి ధర 1.5 యూరోల నుంచి 24 యూరోలకు పైగా పెరిగినప్పటికీ, రఫీఫ్‌కు ఇష్టమైన ఈ చిరుతిండిని కాదనలేక తెచ్చాను” అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టును మొహమ్మద్ జవాద్ అనే వ్యక్తి ఇటీవల షేర్ చేశారు. అయితే అక్టోబర్ 2023లో ఉద్రిక్తతలు పెరిగి, ఆ తర్వాత ఇజ్రాయెల్ సైనిక చర్య(Israeli military action) ప్రారంభమైనప్పటి నుండి గాజాకు ఆహార సరఫరా క్రమంగా తగ్గిపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ఈ ఏడాది మార్చి 2 నుండి మే 19 మధ్య, ఈ పాలస్తీనియన్(Palestinian) ప్రాంతం దాదాపు పూర్తి దిగ్బంధనంలో ఉంది. వస్తువులు అన్ని కూడా బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముడవుతున్నాయి. వస్తువులు సాధారణంగా మానవతా సహాయం కింద ఉచితంగానే గాజాలోకి వస్తాయి. కొద్దిమంది చేతిలోకి మాత్రమే అవి వెళుతున్నాయి. కొరత కారణంగా ఇవి బ్లాక్ మార్కెట్(Black market)లో అధిక ధరలకు అమ్ముడవుతున్నాయని సర్జన్ డాక్టర్ ఖలీద్ అల్షవ్వా వివరించారు. పార్లేజీ ధర కొన్నిచోట్ల రూ. 2,000 పలుకుతున్నప్పటికీ, తాను మాత్రం రూ. 240కు కొనుగోలు చేయగలిగానని సదరు సర్జన్ డాక్టర్ తెలిపారు. ఉత్తర గాజాలో ప్రస్తుతం ఇండియా ధరల ప్రకారం కిలో చక్కెర రూ. 4,914, ఒక లీటర్ వంట నూనె రూ. 4,177, ఒక కిలో బంగాళాదుంపలు Potato రూ. 1,965, ఒక కిలో ఉల్లిపాయలు రూ. 4,423, ఒక కప్పు కాఫీ రూ. 1,800గా ఉన్నాయి. ఈ ధరలు చూసి మనోళ్లు అయితే నోరెళ్లపెడుతున్నారు.
