అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Smart Phone | ప్రస్తుతం అధికారులు, నాయకులు ఎక్కడ మాట్లాడినా దేశానికి యువత బలం అంటుంటారు. కానీ రానున్న రోజుల్లో వారే దేశానికి భారం కానున్నారు. వినడానికి బాధగా ఉన్న ఇది నిజం. స్మార్ట్ ఫోన్(Smart Phone), సోషల్ మీడియాకు బానిసలుగా మారిన యువత దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారనున్నారు.
ప్రస్తుతం చిన్నా పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా(Social Media)లకు బానిసలుగా మారారు. రెండేళ్ల బాలుడు కూడా ఫోన్లో వీడియోలు పెడితేనే అన్నం తినే పరిస్థితి. టీనేజీకి వచ్చిన వారు తమకు ఫోన్ కావాలని మారం చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో విచ్చలవిడిగా బూతులు, అసభ్యకర కంటెంట్‌తో టీనేజీ వారు చెడిపోతున్నారు. ముఖ్యంగా ఓటీటీ(OTT)లు, వెబ్ సిరీస్(Web Series)ల్లోని కంటెంట్‌తో యువత చెడు మార్గాల్లో ప్రయాణిస్తున్నారు.
Smart Phone | నేరాలు చేస్తున్నారు
పాఠశాలకు వెళ్లే విద్యార్థులు(Students) చదువుకోవాలి, ఆడుకోవాలి కానీ ప్రస్తుతం విద్యార్థులు నేరాలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఇటీవల కూకట్పల్లి(Kukatpally)లో దొంగతానికి వెళ్లి బాలికను హత్య చేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఆ బాలుడు చోరీ ఎలా చేయాలో ఓ పేపర్లో రాసుకున్న తీరు విస్మయానికి గురి చేసింది. లోనికి వెళ్లి దొంగతనం చేసిన అనంతరం గ్యాస్ లీక్ చేయాలని అందులో రాసుకున్నాడు. చోరీ చేసే సమయంలో బాలిక చూడటంతో ఆమెను హత్య చేశాడు. ఓ 15 ఏళ్ల బాలుడు దొంగతనం, హత్య చేయడానికి కారణాలు స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా. గతంలో జీడిమెట్లలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక ప్రియుడితో తన తల్లిని హత్య చేయించిన విషయం తెలిసిందే.
Smart Phone | అబ్జర్వేషన్ హోమ్‌కు తరలింపు
కూకట్‌పల్లిలో సహస్రను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. మైనర్ కావడంతో అతన్ని అబ్జర్వేషన్ హోంలో ఉంచారు. శనివారం జువైనైల్ కోర్టు(Juvenile Court)లో బాలుడిని హాజరు పరచనున్నారు. వైద్య పరీక్షల తర్వాత జువైనైల్ హోమ్‌కు తరలించనున్నారు.
Smart Phone | పిల్లలపై కన్నేయండి
ప్రస్తుతం పిల్లలు చిన్నప్పటి నుంచే ఫోన్లకు బానిసలు కావడంతో వారి ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల పుణ్యమా అని నేరాలు చేయడం హీరోయిజంగా భావిస్తున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాకు బానిసలుగా మారిన చాలా మంది ఏ పని చేయకుండా ఈజీ మనీ(Easy Money) కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో దొంగతనాలు చేస్తూ ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు పిల్లలను స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలని చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి అతి గారబం చేయడం, తప్పులు చేస్తున్నా వెనుకేసుకురావడం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే భవిష్యత్‌లో వారి జీవితాలు పాడువుతాయంటున్నారు.