అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి ఇంటికి పార్సిల్ వచ్చింది. అతనిపై నిఘా ఉంచిన పోలీసులు(Police) ఆ పార్సిల్‌ను స్వాధీనం చేసుకొని ఓపెన్ చేసి షాక్ అయ్యారు. హైదరాబాద్(Hyderabad)లోని అమీర్‌పేట్ డీడీ కాలనీలో నివాసం ఉంటున్న కనిష్ కెవిన్ ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతడిని కోర్టులో హాజరు పర్చడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అయితే సదరు ఖైదీ ఇంటికి ఓ పార్సిల్(Parcel) వచ్చింది. కెవిన్‌కు వచ్చిన పార్సిల్‌పై ఎక్సైజ్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పార్సిల్ స్వాధీనం చేసుకొని చూడగా అందులో డ్రగ్స్(Drugs) ఉన్నాయి. 113 ఎల్‌ఎస్డీ బ్లాస్ట్స్, 16 గ్రాముల ఓజీ ఖుష్, 50 పిల్స్ ఆ పార్సిల్లో ఉన్నట్లు గుర్తించారు.
కాగా.. ఢిల్లీలోని ఐఐఐటీ(Delhi IIIT)లో ఉన్నత చదువులు చదువుతున్న సయమంలో కెవిన్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. దీంతో పరీక్షల్లో ఫెయిల్ కావడంతో హైదరాబాద్‌కు వచ్చి హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు(Hotel Management Course)లో చేరాడు. అయితే ఢిల్లీలో ఉన్న పరిచయాలతో అక్కడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నాడు. దీంతో పోలీసులు దాడి చేసి ఇటీవల అరెస్ట్ చేశారు.