Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం సృష్టించాయి. వరదలు భారీ నష్టాన్ని కలిగించాయి. వినాయక చవితి నాడు కురిసిన భారీ వర్షాల (Heavy rains) కు కామారెడ్డి అతలాకుతలం అయింది. భారీ వర్షంతో వరదలు (Flood) పోటెత్తాయి. చెరువులు, కుంటలు నిండిపోయి పొంగ్లిపొర్లాయి. రోడ్లపై వరద చేరి చెరువులు, నదులను తలపించాయి. అనేక చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. మొత్తంగా కామారెడ్డి పట్టణం వరదల్లో చిక్కుకుపోయింది. […]

అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం సృష్టించాయి. వరదలు భారీ నష్టాన్ని కలిగించాయి. వినాయక చవితి నాడు కురిసిన భారీ వర్షాల (Heavy rains) కు కామారెడ్డి అతలాకుతలం అయింది. భారీ వర్షంతో వరదలు (Flood) పోటెత్తాయి.

చెరువులు, కుంటలు నిండిపోయి పొంగ్లిపొర్లాయి. రోడ్లపై వరద చేరి చెరువులు, నదులను తలపించాయి. అనేక చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. మొత్తంగా కామారెడ్డి పట్టణం వరదల్లో చిక్కుకుపోయింది. పలు మండలాల్లోనూ వరదలు పొంగిపొర్లాయి. కార్లతోపాటు మనుషులు కొట్టుకుపోయారు. ఉవ్వెత్తున ముంచుకొచ్చిన వరద వల్ల జాతీయ రహదారి మూసుకుపోయింది.

Paranjyoti Ammavaru : నెట్టింట వైరల్​..

కాగా.. కామారెడ్డిలో సోమవారం (సెప్టెంబరు 1) మధ్యాహ్నం కూడా వర్షం పడింది. అయితే ఆ సమయంలో పట్టణంలోని కల్కినగర్​లో ఉన్న పరంజ్యోతి భగవాన్ అమ్మవారి ఆలయంలో వింత జరిగింది. అమ్మ భగవాన్ విగ్రహం కంట్లో నుంచి కన్నీరు tears కారినట్లు భక్తులు చెబుతున్నారు.

అమ్మవారి Goddess కంటి నుంచి కన్నీళ్లు రావడంతో.. ఆ వెంటనే వర్షం ఆగిపోయిందని భగవాన్ భక్తులు పేర్కొంటున్నారు. ఇది అమ్మవారి కరుణా కటాక్షంగా ప్రచారం చేస్తున్నారు. కాగా.. అమ్మవారి కంట నీరు కారుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...