అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు పనుల నిమిత్తం వచ్చే వారిని లంచాల (bribes) పేరిట వేధిస్తున్నారు. పలువురు గ్రామీణ స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు అవినీతికి పాల్పడుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో శుక్రవారం ఓ పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) ఏసీబీకి చిక్కాడు. తుంగతుర్తి మండలం గానుగబండ బర్పతి కృష్ణ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి గ్రామంలో నూతనంగా ఇంటిని నిర్మించుకున్నాడు. దానికి నంబర్ కేటాయించడం కోసం పంచాయతీ కార్యదర్శి కృష్ణ రూ.6 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ACB Raid | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని పేర్కొన్నారు. అలాగే ఏసీబీ తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు whatsapp (9440446106), facebook (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.