Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Collector | పకడ్బందీగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ: కలెక్టర్​

Kamareddy Collector | పకడ్బందీగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ: కలెక్టర్​

జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి కలెక్టరేట్​లో బుధవారం జిల్లా మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పంచాయతీ ఎన్నికల (Panchayat elections) నిర్వహణకు మంగళవారం షెడ్యూల్​ విడుదల అయిందన్నారు. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. మొదటి విడతలో కామారెడ్డి డివిజన్​లోని (Kamareddy division) భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయిలో ఉంటాయన్నారు. ఎల్లారెడ్డి డివిజన్​లోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం, బాన్సువాడ డివిజన్​లోని (Banswada division) బిచ్కుంద, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, పెద్ద కొడప్ గల్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు.

Kamareddy Collector | జిల్లాలో 532 పంచాయతీల్లో..

జిల్లాలో మొత్తం 25 మండలాల్లో 532 గ్రామ పంచాయతీలు (gram panchayats) ఉండగా.. 4,656 వార్డులు ఉన్నాయన్నారు. జిల్లాలో మొత్తం 4,670 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నామినేషన్ స్వీకరణ కోసం 213 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడత ఎన్నికల నిర్వహణ కోసం 213 మంది రిటర్నింగ్ అధికారులు, 213 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, రెండో విడత ఎన్నికలకు 640 మంది రిటర్నింగ్ అధికారులు, 18 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 2,869 మంది ప్రిసైడింగ్ అధికారులు, 3,771 మంది ఇతర పోలింగ్ అధికారులను నియమించామని వెల్లడించారు.

జిల్లాలో మొత్తం 6,39,730 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 3,32,209 మంది స్త్రీలు, 3,07,508 మంది పురుషులు, ఇతరులు 13 మంది ఉన్నారని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా గ్రీవెన్స్ సెల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనికి ఛైర్మన్​గా అడిషనల్ కలెక్టర్, కన్వీనర్​గా డీఎస్​డీఎస్​వో, మెంబర్లుగా మెప్మా పీడీ, ఉపాధి కల్పనాధికారులు ఉంటారని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు రూ.50 వేల నగదుకు మించి తీసుకెళ్లవద్దని సూచించారు. అక్రమ నగదు, లిక్కర్ (illegal cash and liquor) నివారణ కోసం మండలానికి ఒక ఫ్లయింగ్​ స్క్వాడ్, అంతర్ జిల్లా లిక్కర్, నగదు, ఆయుధాల రవాణా నివారణకు ఐదు టీంలను ఏర్పాటు చేశామన్నారు.

Kamareddy Collector | ఎన్నికలకు భారీ బందోబస్తు: ఎస్పీ

జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు పోలీస్ శాఖ తరపున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. జిల్లాలో ఉన్న చెక్ పోస్టులకు అదనంగా మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 223 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 557 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఈ ప్రాంతాల్లో 780 వెబ్ కాస్ట్​లు, 38 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించనున్నట్లు వెల్లడించారు.

Must Read
Related News