Homeఅంతర్జాతీయంPakistan | పాక్​ కీలక నిర్ణయం.. సీడీఎఫ్‌గా ఆసిమ్ మునీర్ నియామకం

Pakistan | పాక్​ కీలక నిర్ణయం.. సీడీఎఫ్‌గా ఆసిమ్ మునీర్ నియామకం

పాకిస్థాన్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్మీ చీఫ్‌గా పని చేసిన ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను సీడీఎఫ్​గా నియమించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | పాకిస్థాన్​ ప్రభుత్వం (Pakistan Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్మీ చీఫ్‌గా పని చేసిన ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌కు మరో అత్యున్నత పదవి అప్పగించింది. పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా (CDF) ఆసిమ్ మునీర్‌ను నియమిస్తూ పాక్ అధ్యక్ష కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

పాక్​ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ రక్షణ దళాల మొదటి అధిపతిగా సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ (Field Marshal Asim Munir) నియామకాన్ని ఆమోదించారు. CDFగా ఆర్మీ స్టాఫ్ చీఫ్ మునీర్‌ను నియమించాలని కోరుతూ గతంలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (PM Shahbaz Sharif) కోరారు. ఈ మేరకు అధ్యక్షుడు జర్దారీ తాజాగా ఆమోదం తెలిపారు.

Pakistan | రాజ్యాంగ సవరణతో..

కమాండ్ ఐక్యతను సృష్టించడం, క్లిష్ట పరిస్థితిలో నిర్ణయం తీసుకోవడాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా CDF పదవిని సృష్టించారు. దీనికోసం ఆ దేశ రాజ్యాంగంలో సవరణ సైతం చేపట్టారు. 5 ఏళ్లపాటు CDFగా ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్‌ను COASగా ఏకకాలంలో నియామకానికి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు. ఫీల్డ్ మార్షల్ మునీర్‌ను నవంబర్ 2022లో మొదట మూడు సంవత్సరాల పాటు COASగా నియమించారు. 2024లో ఆయన పదవీకాలాన్ని ఐదు సంవత్సరాల పాటు పొడిగించారు.

Pakistan | సర్వాధికారులు

పాకిస్థాన్​లో ఇప్పటికే సైన్యం పరోక్ష పాలన చేపడుతుంది. అన్ని నిర్ణయాలు సైన్యం ఆమోదంతోనే జరుగుతాయనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ దేశ ఆర్మీ చీఫ్​ మునీర్​కు మరిన్ని అధికారులు అప్పగించడం గమనార్హం. ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి పొందిన ఆసిమ్ మునీర్, CDF విధులతో పాటు, ఆర్మీ చీఫ్ పదవిని కూడా ఏకకాలంలో నిర్వహిస్తారు.

Must Read
Related News