ePaper
More
    Homeఅంతర్జాతీయంPakistan Stock Market | ఆపరేషన్‌ సింధూర్‌ ఎఫెక్ట్‌.. పాక్‌ స్టాక్‌ మార్కెట్‌ ఢమాల్‌

    Pakistan Stock Market | ఆపరేషన్‌ సింధూర్‌ ఎఫెక్ట్‌.. పాక్‌ స్టాక్‌ మార్కెట్‌ ఢమాల్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pakistan Stock Market | జమ్మూ కశ్మీర్‌(Jammu Kashmir)లోని పహల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడికి భారత్‌ పక్షం రోజుల తర్వాత దీటైన సమాధానమిచ్చింది. పాకిస్థాన్‌(Pakistan) భూభాగంలోకి చొచ్చుకుపోయి మరీ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల ప్రకంపనల ప్రభావం పాక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (Pak stock exchange)పై తీవ్రంగా కనిపించింది. పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ బెంచ్‌మార్క్‌ సూచీ (కేఎస్‌ఈ -100)కి మాస్టర్‌ స్ట్రోక్‌ కు గురైయింది. కేఎస్‌ఈ (KSE) -100 బుధవారం ఉదయం సుమారు 5.5 శాతం నష్టాలతో ప్రారంభమైంది. క్రితం ముగింపుతో పోల్చితే 6,272 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా ఆ తర్వాత క్రమంగా కోలుకుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో 2,500లకుపైగా పాయింట్ల నష్టంతో ట్రేడ్‌ (Trade) అవుతోంది. పాకిస్థాన్‌కు చెందిన అగ్రిటెక్‌ 9.3 శాతం నష్టపోగా.. సీర్లే 7.7 శాతం, యూసఫ్‌ వీవింగ్‌ (Yousaf weaving) 7.1 శాతం, కోహినూర్‌ టెక్స్‌టైల్‌ 6.7 శాతం పడిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత కరాచీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (Karachi stock exchange) 9 వేలకుపైగా పాయింట్లు నష్టపోయింది. కాగా ఇదే సమయంలో మన సెన్సెక్స్‌ మాత్రం 1.5 శాతం మేర లాభపడడం గమనార్హం.

    Pakistan Stock Market | అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

    ఆపరేషన్‌ సింధూర్‌(Operation sindoor)తో పాక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నష్టాల బాటలో పయనించగా.. భారత్‌(Bharath) ఎక్స్ఛేంజీలు మాత్రం స్వల్ప లాభనష్టాల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ మొదలైనా.. ఆ తర్వాత కొంత సేపటికే లాభాలబాట పట్టాయి. స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ కదలాడుతున్నాయి. భారత్‌, పాక్‌ల (India and Pakistan) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(foreign institutional investors) మన మార్కెట్లపై నమ్మకంతో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి (Jammu and Kashmir terror attack) తర్వాత పాకిస్థాన్‌పై ప్రతీకార దాడులు తప్పవన్న అంచనాలతో ఇన్వెస్టర్లున్నారు. దీంతో సైన్యం మెరుపు దాడులు చేసినా పెద్దగా ఆశ్చర్యానికి లోనుకాలేదు. అయితే భారత్‌ చర్యకు పాక్‌(Pakistan) ఎలాంటి స్పందన ఉంటుందోనని ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...