ePaper
More
    Homeఅంతర్జాతీయంPetrol price | ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్.. పెట్రోల్ ధర రూ.266, డీజిల్ రేట్ రూ.272

    Petrol price | ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్.. పెట్రోల్ ధర రూ.266, డీజిల్ రేట్ రూ.272

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Petrol price | భారత్(India)తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుంది. అధిక ద్రవ్యోల్బణం ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది.

    ఇప్పటికే అత్యధిక ధరలతో అక్కడి ప్రజలు సతమతమవుతుంటే, పరిస్థితిని మరింత దిగజార్చేలా పాక్ ప్రభుత్వం (Pakistan government) పెట్రోల్, డీజిల్ రేట్లను (petrol and diesel prices) పెంచేసింది. సామాన్యులపై భారీగా భారం మోపుతూ పక్షం రోజుల పాటు ఇంధన ధరల పెంపును ప్రకటించింది. తాజా నివేదికల ప్రకారం.. పాకిస్తాన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.10.39 పెరిగింది. నెల వ్యవధిలోనే ఇది రెండవసారి పెంపు. గత జూన్ 16న పెట్రోల్ లీటరుకు రూ.4.80, హై-స్పీడ్ డీజిల్ రూ.7.95 చొప్పున పెరిగింది.

    Petrol price | డీజిల్ ధర రూ.272.98

    ఆర్థిక శాఖ (Finance Ministry) నోటిఫికేషన్ ప్రకారం, పెట్రోల్ ధర లీటరుకు రూ.8.36 పెరిగింది. తాజా పెంపుతో, పెట్రోల్ ధర రూ.258.43 నుంచి రూ.266.79కి పెరిగింది. ఇక హై-స్పీడ్ డీజిల్ ధర రూ.262.59 నుంచి రూ.272.98కి చేరింది. పెరిగిన ఈ కొత్త ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. పాకిస్తాన్ మీడియా నివేదికల (Pakistan media reports) ప్రకారం, చమురు, గ్యాస్ (Oil and Gas) నియంత్రణ సంస్థ (OGRA), సంబంధిత మంత్రిత్వ శాఖల సిఫార్సుల మేరకే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు.

    అంతర్జాతీయ మార్కెట్ ధోరణులలో హెచ్చుతగ్గులు ఇంధన ధరల పెరుగుదలకు కారణమని ప్రభుత్వం పేర్కొంది. అయితే, పెట్టుబడిదారులు మధ్యప్రాచ్య నష్టాలను తగ్గించడంపై దృష్టి సారించడంతో సోమవారం అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్, US ముడి చమురు బెంచ్మార్క్ లు రెండూ మార్చి 2023 తర్వాత వారి అతిపెద్ద వారపు తగ్గుదలను నమోదు చేశాయి.

    Petrol price | పెట్రోల్, డీజిల్ పై లెవీ

    మరోవైపు, పాకిస్తాన్ ప్రభుత్వం (Pakistan Government) పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూ.2.50 చొప్పున కార్బన్ లెవీని కూడా విధించింది. పెట్రోల్ పై పెట్రోలియం డెవలప్మెంట్ లెవీ (PDL) లీటరుకు రూ.75.52కి పెంచగా, డీజిల్ పై లీటరుకు రూ.74.51 లెవీ విధిస్తోంది.

    More like this

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...

    Super Six | “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి .. ఎవ‌రెవ‌రు హాజ‌రు కానున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Super Six | కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలిసారిగా అధికార పక్షం ఆధ్వర్యంలో...

    Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్​​ క్రీడాకారుల ఎంపికలు

    అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్​బాల్​ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్...