అక్షరటుడే, న్యూఢిల్లీ: Pak Army firing : పాక్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దాడుల తర్వాత నియంత్రణరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ భారీగా కాల్పులు జరిపింది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు, ప్రజల ఇళ్లపై మోర్టార్లు, ఫిరంగులను మోగించింది. పాక్ కాల్పుల్లో సరిహద్దు గ్రామాలకు చెందిన 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 43 మంది గాయపడినట్లు తెలిసింది.
పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. భారత్ ఎదురుదాడిలో పాకిస్తాన్ సైనిక పోస్టులు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పూంచ్‌తో పాటు రాజౌరి, కుప్వారా జిల్లాలోని కర్నాహ్, యురి, తంగ్దర్ సెక్టార్‌లలోనూ పాక్ కాల్పులు జరిపింది. పాక్ కాల్పులకు.. భారత సైన్యం దీటుగా సమాధానం ఇచ్చింది.
