అక్షరటుడే, నిజామాబాద్: Padmasali Sangham | నగరంలోని పద్మజ్యోతి పద్మశాలి సంఘం(Nizamabad Padma Jyoti Padmasali Society) 49వ తర్ప నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని వినాయక్‌నగర్‌లో(vinayak nagar) గల పద్మశాలి సంఘ భవనంలో నిర్వహించారు.
సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు దీకొండ యాదగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్ష కార్యదర్శులు అంకం రాజేందర్, గజం సుదర్శన్, కోశాధికారి వెంకట లక్ష్మణ్‌తో పాటు కార్యవర్గ సభ్యులతో నగర అధ్యక్షుడు వెంకట నర్సయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హన్మాండ్లు, కోశాధికారి భూమేశ్వర్, పద్మజ్యోతి పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు భూమయ్య, హన్మాండ్లు, కార్యనిర్వహక కార్యదర్శి రాకేష్, సహాయ కార్యదర్శులు సాయన్న, నారాయణ, కార్యవర్గ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.