Padma Awards ceremony | శ్రీజేశ్, అశ్విన్​కు పద్మ అవార్డులు- భారత అథ్లెట్లకు అరుదైన గౌరవం
Padma Awards ceremony | శ్రీజేశ్, అశ్విన్​కు పద్మ అవార్డులు- భారత అథ్లెట్లకు అరుదైన గౌరవం

అక్షరటుడే, న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారం పొందారు. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కొనసాగింది. ఈ వేడుకకు అశ్విన్ భార్య, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం వేళ అశ్విన్​కు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారం ప్రకటించింది. భారత క్రికెట్ జట్టుకు అశ్విన్ అందించిన సేవలకుగాను పద్మ అవార్డుతో కేంద్రం సత్కరించింది.

అశ్విన్ 2010లో అంతర్జాతీయ టీ20తో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 14 ఏళ్ల కెరీర్​లో అశ్విన్ టీమిండియా అనేక విజయాలు అందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో పలు రికార్డులు లిఖించాడు. టెస్టుల్లో 537 వికెట్లు తీసుకొని, 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. గతేడాది ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​తో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో ఆడుతున్నాడు.

Padma Awards ceremony : భారత అథ్లెట్​..

భారత అథ్లెట్, టీమిండియా మాజీ హాకీ ప్లేయర్, ఒలింపిక్ మెడలిస్ట్ పీఆర్ శ్రీజేశ్ Indian athlete, former Team India hockey player, and Olympic medalist PR Sreejesh పద్మ భూషణ్ అవార్డు Padma Bhushan award అందుకున్నారు. రాష్ట్రపతిభవన్​లో శ్రీజేశ్​కు ద్రౌపదీ ముర్ము పురస్కారం అందజేశారు. ఈ వేడుకకు శ్రీజేశ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. శ్రీజేశ్ సంప్రదాయ దుస్తులైన పంచకట్టుతో ఈ ఈవెంట్​కు వచ్చారు.