అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Centers | వరి కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశించారు. తాడ్వాయి మండలం (Tadwai Mandal) కరడ్పల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్ల తీరు, గన్నీబ్యాగులు, రవాణా సదుపాయాలను ఆరా తీశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం స్థానిక ప్రజలతో కలెక్టర్ మాట్లాడగా వారు పలు సమస్యలను కలెక్టర్ ముందుంచారు. జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో ఉన్న డంపింగ్ యార్డు ద్వారా ఇబ్బందులు వస్తున్నాయని.. పాఠశాలలో తాగునీరు (drinking water), టాయిలెట్స్ సమస్యలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే తహశీల్దార్, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్ వెంట పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, సీపీవో, తదితరులున్నారు.
