అక్షరటుడే, హైదరాబాద్: Osmania University | నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో హైదరాబాద్లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ Osmania University (OU) ఆంధ్ర మహిళా సభ Andhra Mahila Sabha లో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాత్విక(18) ఆత్మహత్యాయత్నం చేసింది. NCC గేటు సమీపంలో ఉన్న ప్రైవేటు వసతి గృహం ఐదో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Osmania University | ఫలితాలు చూసుకుని..
డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ క్రమంలో తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయినట్లు గుర్తించిన సాత్విక తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, స్థానికుల సాయంతో ఆంధ్ర మహిళా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రి Gandhi Hospital కి తీసుకెళ్లారు.