అక్షరటుడే, ముప్కాల్: Mupkal Mandal | ‘సే నో టు డ్రగ్స్’ నినాదంతో బ్యాడ్మింటన్ పోటీల నిర్వహణ అభినందనీయమని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు (Armoor ACP Venkateshwarlu) అన్నారు. నాయకుడు సంతోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్’ (SAY NO TO DRUGS) నినాదంతో ముప్కాల్ మండలంలోని (Mupkal Mandal) భూదేవ్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలను ఘనంగా నిర్వహించారు.
Mupkal Mandal | మండలాల నుంచి 20 జట్లు..
పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, క్రీడలకు దగ్గరగా ఉంటూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఈ పోటీల్లో వివిధ మండలాల నుంచి మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి.
కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీవో, తహశీల్దార్ బృందం, ఎస్సై పోలీస్ జట్టు మధ్య తొలి మ్యాచ్ నిర్వహించగా, ఎస్సై జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో నాయకుడు సంతోష్ ఫౌండేషన్ ఛైర్మన్ సంతోష్, స్థానిక ఎంపీడీవో రమేష్, తహశీల్దార్ ముంతాజుద్దీన్, ఎంపీవో గౌస్, స్థానిక ఎస్సై కిరణ్ పాల్, తెలంగాణ కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు కబడ్డీ గంగాధర్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం నర్సారెడ్డి, వేంపల్లి ఉపసర్పంచ్ భరత్, స్థానిక పంచాయతీ కార్యదర్శి మల్లేష్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, బ్యాడ్మింటన్ ముప్కాల్ అధ్యక్షుడు గంగరాజు, సీనియర్ క్రీడాకారులు ప్రవీణ్, సంజీవ్ థామస్, దినేష్, రఘు, శ్రీను, ప్రశాంత్, నవీన్, నందు తదితరులు పాల్గొన్నారు.