అక్షర టుడే, ఇందూరు : Turmeric Board | ఆర్గానిక్ పసుపు (Organic Turmeric) ను పండిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరింత డిమాండ్ పెరుగుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) తెలిపారు. పసుపు బోర్డు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని హోటల్లో వార్షికోత్సవ సభ నిర్వహించారు.
Turmeric Board | పసుపు సాగులో జిల్లా ప్రత్యేకం
ఎంపీ మాట్లాడుతూ.. పసుపు సాగులో జిల్లా ప్రత్యేకతను కలిగి ఉందని, మూడు దశాబ్దాల రైతుల కలను నరేంద్ర మోదీ (Narendra Modi) నెరవేర్చారని తెలిపారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లా వ్యక్తిని మొట్టమొదటి ఛైర్మన్గా నియమించడం అదృష్టం అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పసుపు పంటసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. అయితే రైతులు ఆర్గానిక్ పసుపు పంటను సాగుచేస్తే మరింత డిమాండ్ ఉంటుందని సూచించారు.
Turmeric Board | పసుపు రైతుల బాధలపై అవగాహన ఉంది
పసుపు రైతుల బాధలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని వారికి ప్రభుత్వపరంగా జిల్లాయంత్రాంగం తరఫున పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. రైతులు సంప్రదాయ పద్ధతులకు బదులుగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక విధానాల్లో నాణ్యమైన పసుపు పంటను సాగు చేయాలన్నారు. సేంద్రియ విధానంలో పంటను సాగుచేస్తే మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు.
Turmeric Board | శాస్త్రీయ పద్ధతులు అవలంభించాలి
కేవలం పంట సాగుకే పరిమితం కాకుండా పసుపు ప్రాసెసింగ్ విధానాల్లోనూ శాస్త్రీయ పద్ధతులను అవలంభించాలని, ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ అన్నారు. అంతకుముందు పసుపు బోర్డు కార్యదర్శి ఐఏఎస్ అధికారిణి భవానిశ్రీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఉద్యానశాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.