Oppo K13 X | ఎంట్రీకి రెడీగా ఒప్పో కే13 ఎక్స్‌.. వచ్చేనెలలో లాంచ్‌ అయ్యే అవకాశం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oppo K13 X | చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో(OPPO) మరో మోడల్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇటీవలే సిల్హౌట్‌ను విడుదల చేసింది. లాంచ్‌ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు. వచ్చేనెలలో OPPO K13x 5G model మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)తో పాటు ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనుంది. కంపెనీనుంచి లీక్‌ అయిన సమాచారం మేరకు ఈ మోడల్‌ ఫీచర్లు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oppo K13 X | చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో(OPPO) మరో మోడల్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇటీవలే సిల్హౌట్‌ను విడుదల చేసింది. లాంచ్‌ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు. వచ్చేనెలలో OPPO K13x 5G model మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)తో పాటు ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనుంది. కంపెనీనుంచి లీక్‌ అయిన సమాచారం మేరకు ఈ మోడల్‌ ఫీచర్లు ఇలా ఉండే అవకాశాలున్నాయి.

డిస్‌ప్లే : 6.7 ఇంచెస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే. 1080 × 2400 పిక్సెల్స్‌ Full HD+ రిజల్యూషన్‌. 120 Hz రిఫ్రెష్‌ రేట్‌. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌.

ప్రాసెసర్ : మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌.

బ్యాటరీ: 6000 mAh బ్యాటరీ. 45w ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌.

కెమెరా : 50 MP డ్యుయల్‌ రేర్‌ కెమెరా, 2 MP డెప్త్‌ సెన్సార్‌. ఏఐ ఆధారిత కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంటుంది. 8MP లేదా 16 MP ఫ్రంట్‌ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇందులో ఏఐ ఇమేజింగ్‌, ఎడిటింగ్‌ ఫీచర్లుండే అవకాశాలున్నాయి.

ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 15.

కలర్స్ : మిడ్‌నైట్‌ వయోలెట్‌, సన్‌సెట్‌ పీచ్‌ కలర్లలో లభించనుంది.

అదనపు ఫీచర్లు : IP 65 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌. 360 డిగ్రీస్‌ ఆర్మర్‌ బాడీ, మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌.

వేరియంట్‌ : 8 GB + 256 GB. ధర రూ. 16 వేలలోపు ఉండే అవకాశాలున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...