ePaper
More
    Homeజాతీయంoperation sindoor | ఆప‌రేష‌న్ సిందూర్‌పై స్పందించిన ప్ర‌ముఖులు..మెగాస్టార్ చిరంజీవి ఏమ‌న్నారంటే..!

    operation sindoor | ఆప‌రేష‌న్ సిందూర్‌పై స్పందించిన ప్ర‌ముఖులు..మెగాస్టార్ చిరంజీవి ఏమ‌న్నారంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: operation sindoor | ప‌హ‌ల్గాం (Pahalgam) ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాక్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త్ సైన్యం (Indian Army) మెరుపు దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు వంద‌కి పైగా ఉగ్ర‌వాదులు (terrorists) క‌న్నుమూసిన‌ట్టు స‌మాచారం. ఈ ఆప‌రేష‌న్ త‌ర్వాత సినీ సెలెబ్రిటీలు (film celebrities) ఇండియన్ ఆర్మీకి (Indian Army) సెల్యూట్ కొడుతూ తమ స్పందన తెలియజేస్తున్నారు. నటుడు రితేష్ దేశ్ముఖ్, దర్శకుడు మధుర్ భండార్కర్ముందుగా ఆపరేషన్ సిందూర్ పై (OperationSindoor) స్పందించారు. ఎక్స్ లో రితేష్ దేశ్ముఖ్, “జై హింద్ కి సేన… భారత్ మాతా కి జై!! OperationSindoor” అంటూ గర్వభావంతో ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ పై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తాజాగా సోషల్ మీడియాలో (social media) పోస్ట్ చేశారు. సింపుల్ గా జైహింద్ (Jai Hind) అని పోస్ట్ చేసిన చిరంజీవి భారత సైన్యాన్ని పరోక్షంగా అభినందించారు.

    operation sindoor | ప్ర‌శంస‌ల వ‌ర్షం

    బేబీ చిత్ర నిర్మాత ఎస్ కే ఎన్ (Baby film producer SKN) కూడా భారత సైన్యం (Indian Army) చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను (OperationSindoor) అభినందించారు. ‘జైహింద్.. మనందరి ప్రార్థనలు భారత సైన్యానికి తోడుగా ఉంటాయి’అని ట్వీట్ చేశారు. మన దళాల కోసం ప్రార్థనలు. ఒకే దేశం, మనమంతా ఒక్కటిగా ముందుకు సాగుదాం. జై హింద్, వందేమాతరం (Vande Mataram) అని మ‌ధుర్ బండార్క‌ర్ పేర్కొన్నారు. నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), మైత్రి బోధ్ పరివార్ సంస్థ ద్వారా భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ సందేశాన్ని షేర్ చేశారు. సీనియర్ నటుడు పరేశ్ రావల్ (paresh rawal) ఆపరేషన్‌ సిందూర్ పై ఎక్స్ ద్వారా స్పందించారు. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఆపరేషన్ సిందూర్ పై స్పందించారు. ‘భారత్ మాతా కీ జై’ (‘Bharat Mata Ki Jai’) అని పోస్ట్ చేశారు. మా ప్రార్ధ‌న‌లన్నీ కూడా బ‌ల‌గాల‌తోనే ఉంటాయి. క‌లిసి నిల‌బ‌డ‌దాం అని పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు.

    ‘భారత్ మాతాకీ జై’ (‘Bharat Mata Ki Jai’) అంటూ ఎక్స్‌లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Union Minister Rajnath Singh) తెలిపారు. భారత్‌ మాతాకీ జై అంటూ కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ (Union Minister Piyush Goyal) స్పందించారు. భారత్ మాతాకీ జై.. జైహింద్ అంటూ ఎక్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) పోస్ట్ చేశారు. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) హెచ్చరించారు. మేరా భారత్ మహాన్.. జైహింద్ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. జీరో టోలరెన్స్‌ఫర్ టెర్రరిజం భారత్ మాతాకీ జై అని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మద్దతు పలికారు. ‘జై హింద్.. మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. పాకిస్తాన్ (Pakistan) లో భారతదేశం చేసిన త్రివిధ దళాల దాడిని ఆయన ప్రశంసించారు. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (operation sindoor) సాయుధ దళాల చర్యలకు కాంగ్రెస్ ఏకగ్రీవ మద్దతు ప్రకటించిందన్నారు.

    More like this

    Hyderabad | జేబీఎస్​ బస్టాండ్​ వద్ద దుకాణాల కూల్చివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని జేబీఎస్​ (JBS) వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటు...

    Kerala Government | కేరళ ప్ర‌భుత్వం వినూత్న పథకం.. ఖాళీ ప్లాస్టిక్ మద్యం సీసాకు రూ. 20 వాపసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala Government | పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేరళ ప్రభుత్వం మరో కొత్త ప్రయోగానికి...

    Stock Markets | లాభాల బాటలో మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్‌(IT...