Operation Sindoor | ‘టెర్ర‌ర్ న‌ర్స‌రీ’గా ‘ముర్కిదే’.. ల‌ష్క‌రే తోయిబా ఇక్క‌డ నుండే ఆప‌రేష‌న్స్ చేస్తుందా..?

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ప‌హ‌ల్​గామ్​లో 26 మంది ప‌ర్యాట‌కుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ఉగ్ర‌వాదుల‌కు భార‌త ఆర్మీ(Indian Army) గ‌ట్టిగా బ‌దులిచ్చింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి 1.44 గంట‌ల‌కు పాకిస్తాన్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని 9 ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త సైన్యం మెరుపుదాడుల‌తో విరుచుకుప‌డ‌డంతో ఒక్క బహావల్‌పూర్‌(Bahawalpur)లోనే 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఈ దాడుల్లో 100 మందికిపైగా టెర్రరిస్ట్‌లు హతమైనట్టు తెలుస్తోంది. Operation Sindoor | అర్ధ‌రాత్రి దాడులు.. ప‌హ‌ల్​గామ్​ ఉగ్ర‌దాడి(Pahalgam Terror Attack) వెనుకాల ల‌ష్క‌రే […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ప‌హ‌ల్​గామ్​లో 26 మంది ప‌ర్యాట‌కుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ఉగ్ర‌వాదుల‌కు భార‌త ఆర్మీ(Indian Army) గ‌ట్టిగా బ‌దులిచ్చింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి 1.44 గంట‌ల‌కు పాకిస్తాన్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని 9 ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త సైన్యం మెరుపుదాడుల‌తో విరుచుకుప‌డ‌డంతో ఒక్క బహావల్‌పూర్‌(Bahawalpur)లోనే 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఈ దాడుల్లో 100 మందికిపైగా టెర్రరిస్ట్‌లు హతమైనట్టు తెలుస్తోంది.

Operation Sindoor | అర్ధ‌రాత్రి దాడులు..

ప‌హ‌ల్​గామ్​ ఉగ్ర‌దాడి(Pahalgam Terror Attack) వెనుకాల ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ ఉన్న‌ట్లు భార‌త సైన్యం అనుమానించింది. దీంతో ఆ సంస్థ‌కు ప్ర‌ధాన స్థావ‌ర‌మైన ముర్కిదేను భార‌త సైన్యం(Indian Army) ల‌క్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్‌లోని ప్ర‌ధాన వాణిజ్య కేంద్ర‌మైన లాహోర్‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ముర్కిదే ఉంది. ముర్కిదేలో 200 ఎక‌రాల్లో ల‌ష్క‌రే తోయిబా త‌న ఉగ్ర‌స్థావ‌రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ల‌ష్క‌రే తోయిబా అనుబంధ సంస్థ జ‌మ్మ‌త్ ఉద్ దావా(Jammat-ud-Dawa) కూడా ఇక్క‌డి నుంచే త‌న కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్‌ India ధ్వంసం చేసింది.

ముర్కిదే ప్రాంతం టెర్ర‌ర్ న‌ర్స‌రీ(Terror Nursery)గా పేరుగాంచింది. ఈ క్యాంపును 200 ఎక‌రాల్లో విస్త‌రించి, ఉగ్ర‌వాద శిక్ష‌ణా కార్యకలాపాల‌ను కొన‌సాగిస్తున్నట్లు సమాచారం. ఇది ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు ముర్కిదే ఒక న‌ర్వ్(నాడీ) సెంట‌ర్‌గా పేరుగాంచింది. ఇక్కడే అయితే 80 నుంచి 90 మంది దాకా టెర్ర‌రిస్టులు Terrorists చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. యుద్ధంలో పాల్గొన్న ఫైటర్‌ జెట్‌లు, పైలట్లు భారత్‌కు సేఫ్‌గా తిరిగివచ్చారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఐదు ప్రాంతాలే లక్ష్యంగా దాడులు జరిపింది. బ‌హ‌వ‌ల్‌పూర్ జైషే మ‌హ్మ‌ద్, ముర్కిదేలోని ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద స్థావరాల‌ను ధ్వంసం చేసినట్లు సమాచారం. కాగా.. ‘ఆపరేషన్ సింధూర్‌’(Operation Sindhoor)ను భారత ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) స్వయంగా పర్యవేక్షించారు. వార్‌రూమ్‌ నుంచి లైవ్‌లో వీక్షించినట్లు తెలుస్తోంది. కాగా.. నేడు 11 గంటలకు CCS కీలక భేటీ జరగనుంది. అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...