Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | అర్హులకే సదరం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి

Yellareddy | అర్హులకే సదరం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి

అర్హులైన దివ్యాంగులకు మాత్రమే సదరం ధ్రువీకరణ పత్రాలు అందించాలని డీఆర్డీవో సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సదరం క్యాంప్​ను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | అర్హులైన దివ్యాంగులకు మాత్రమే సదరం ధ్రువీకరణ పత్రాలు అందించాలని డీఆర్డీవో సురేందర్ (DRDO) అన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంప్​ను (Sadarem camp) శుక్రవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా క్యాంప్​నకు హాజరైన దివ్యాంగులతో మాట్లాడి వారికి కల్పించిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లుతో ఆస్పత్రి గదులను పరిశీలించి సదరం క్యాంప్​నకు అదనపు గదులు కల్పించాలని కోరారు.

దివ్యాంగులతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ అబ్దుల్ అజీం, డీపీఎం సురేష్ కుమార్, డాక్టర్ సంతోష్ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.