Teachers Training | ఉపాధ్యాయులకు కొనసాగుతున్న శిక్షణా తరగతులు

అక్షరటుడే, ఆర్మూర్: Teachers Training | ఆలూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు (Government Schools Teachers )మంగళవారం శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు ఉంటాయని, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిచ్కుందలో.. అక్షరటుడే, బిచ్కుంద: మండలంలోని (Bichkunda Mandal) జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. తెలుగు, ఆంగ్లం, గణితం, ఈవీఎస్‌ పాఠ్యాంశాలకు సంబంధించి డిజిటల్‌ రూపంలో తరగతులు […]

అక్షరటుడే, ఆర్మూర్: Teachers Training | ఆలూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు (Government Schools Teachers )మంగళవారం శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు ఉంటాయని, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బిచ్కుందలో..

అక్షరటుడే, బిచ్కుంద: మండలంలోని (Bichkunda Mandal) జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. తెలుగు, ఆంగ్లం, గణితం, ఈవీఎస్‌ పాఠ్యాంశాలకు సంబంధించి డిజిటల్‌ రూపంలో తరగతులు నిర్వహించారు. మద్నూర్‌ (Madnoor) మండలానికి చెందిన 71మంది, డోంగ్లీ మండలానికి చెందిన 30 మంది ఉపాధ్యాయులు శిక్షణ తరగతులకు హాజరైనట్లు కేంద్రం ఇన్‌ఛార్జి శ్రీనివాస్, సునీల్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆర్పీలు శ్రీధర్, గంగారాజం, దశరథ్, స్వామి, లక్ష్మణ్, అనిత, సాయిలు, మమత, సూర్యకాంత్, యాదవ్‌ రావు పాల్గొన్నారు.

నిజాంసాగర్​లో..

అక్షరటుడే,నిజాంసాగర్‌: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మారుతున్న కాలానుగుణంగా నూతన బోధనా పద్ధతులు అవలంభించాలని ఎంఈవో తిరుపతిరెడ్డి, అమర్‌సింగ్‌ అన్నారు. మంగళవారం నిజాంసాగర్(Nizamsagar), మహమ్మద్‌ నగర్‌ (Mahammad nagar) మండలాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా బోధించాలన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్‌ హెచ్‌ఎం వెంకట్‌ రాంరెడ్డి, జీహెచ్‌ఎస్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం వెంకటేశం, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడలో..

అక్షరటుడే, బాన్సువాడ: ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధించాలని ఎంఈవో నాగేశ్వరరావు(Banswada) అన్నారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన ఎస్జీటీ, ఎల్‌ఎఫ్‌ఎల్‌ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్‌ హెచ్‌ఎం వెంకట రమణ, ఎమ్మార్పీలు సంతోష్, సుధాకర్‌ గౌడ్, ప్రవీణ్‌ కుమార్, రవి కుమార్, వాజీద్‌ అలీ, పండరి, రాజశేఖర్‌ చౌదరి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...