Sriramsagar | శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

అక్షరటుడే, బాల్కొండ​: Sriramsagar | తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువన ఉన్న మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. Sriramsagar | ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి.. వరద పోటెత్తుతుండడంతో ప్రాజెక్టుకు 1,28,000 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో 25 గేట్లు ఎత్తి దిగువకు 1,16,163 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. […]

అక్షరటుడే, బాల్కొండ​: Sriramsagar | తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువన ఉన్న మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది.

Sriramsagar | ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి..

వరద పోటెత్తుతుండడంతో ప్రాజెక్టుకు 1,28,000 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో 25 గేట్లు ఎత్తి దిగువకు 1,16,163 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పశువుల కాపరులు, గొర్ల కాపారులు, చేపలు పట్టేవారు, రైతులు, ప్రజలు నది దాటే ప్రయత్నం చేయవద్దని ప్రాజెక్టు ఏఈఈ కొత్తరవి సూచించారు.

Sriramsagar | పూర్తిస్థాయిలో ప్రాజెక్టు

ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. 1090.09 అడుగుల (80.05 టీఎంసీ) మేర నీరు నిల్వ ఉంది. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నీటిమట్టం ఆధారంగా నీటిని దిగువకు వదులుతున్నారు.

Sri Ramsagar | కాల్వల ద్వారా నీటి విడుదల…

ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో 25 గేట్ల నుంచి దిగువకు నీటిని వదులుతున్నారు. అలాగే కాలువ ద్వారా నీటిసరఫరా కొనసాగుతోంది. వరద కాలువ ద్వారా 6,735 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్యులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. 709 క్యూసెక్కులు ఆవిరి అవుతోంది. అలాగే సరస్వతి కాలువ నుంచి 400 క్యూసెక్కుల నీరు, లక్ష్మి కాలువ నుంచి 200 క్యూసెక్కులు, అలీసాగర్​ లిఫ్ట్​కు 180 క్యూసెక్కులు వదులుతున్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...