అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sriram Sagar | శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్(Sriram Sagar Project)కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 59,774 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.ఎగువన, స్థానికంగా వర్షాలు తగ్గడంతో ప్రాజెక్ట్‌లోకి వరద తగ్గింది.
దీంతో అధికారులు దిగువకు నీటి విడుదలను తగ్గించారు. జలాశయంలో 59,774 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. వరద గేట్ల ద్వారా 49,984 క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతోంది.
Sriram Sagar | నిజాంసాగర్‌లోకి..
నిజాంసాగర్(Nizam Sagar)లోకి ఎగువ నుంచి 41,680 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం అంతేమొత్తం నీటినిల్వతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. వరద గేట్ల ద్వారా 40,680 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నారు.
Sriram Sagar | పోచారం ప్రాజెక్ట్..
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం డ్యామ్‌లోకి స్వల్పంగా ఇన్‌ఫ్లో వస్తోంది. గుండారం, పెద్దవాగుల ద్వారా 1763 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతేమొత్తం నీరు ప్రాజెక్ట్ అలుగుపై నుంచి పొంగి పొర్లుతోంది.
