అక్షరటుడే, న్యూఢిల్లీ: OnePlus CEO | తైవాన్ – చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయిన సమయంలో తైవాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ (OnePlus) సీఈవోపై చర్యలకు ఉపక్రమించింది. ఆయనై అరెస్ట్ వారెంట్ జారీ Taiwan arrest warrant issue చేసింది.
కాగా, చైనీస్ టెక్ కంపెనీ సీఈవోకు తైవాన్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. లోకల్ ట్యాలెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకోవడం, టెక్నాలజీని లీక్ చేయడం అనే నేరాలపై తైవాన్ ఈ చర్యలు చేపట్టింది.
పీట్ లా నేతృత్వంలో గత పది సంవత్సరాల్లో 70 మంది ఇంజినీర్లను అక్రమంగా నియమించుకున్నారనే ఆరోపణలపై షిలిన్ జిల్లా ప్రాసిక్యూటర్స్ కార్యాలయం వారెంట్ జారీ చేసింది. తైవాన్ క్రాస్ స్ట్రైట్ చట్టం Taiwan’s Cross-Strait Act ప్రకారం.. పీట్ లాను అరెస్టు చేయాలని వారెంట్‌లో ఉంది. తైవాన్‌లో చైనా వ్యాపార నిబంధనలను లా ఉల్లంఘించినట్లు వారెంట్‌లో వెల్లడించారు.
OnePlus CEO | ఏమిటీ ఉల్లంఘనలు..
ప్రాసిక్యూటర్స్ ప్రకారం.. హాంగ్ కాంగ్లో వన్ ప్లస్ షెల్ కంపెనీ ఏర్పాటు చేసింది. అయితే 2015లో తైవాన్‌లో స్థానిక సర్కారు పర్మిషన్ లేకుండానే బ్రాంచ్ తెరిచింది. చైనా కంపెనీలు తైవానీస్ లోకల్ ట్యాలెంట్‌ను ఉపయోగించుకోవాలంటే.. సర్కారు నుంచి అనుమతి పొందాలి. కానీ, వన్ ప్లస్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఇంజినీర్లను తన కంపెనీలో చేర్చుకుందనేది ప్రధాన ఆరోపణ. స్థానిక ఇంజినీర్ల ద్వారా తమ దేశ టెక్నాలజీని కాపీ కొట్టేందుకు ప్రయత్నించినట్లు తైవాన్ అభియోగం మోపుతోంది.
OnePlus CEO | చిప్ టెక్నాలజీనే కారణమా..
తైవాన్ ఈ స్థాయిలో స్పందించడానికి కారణం.. తైవాన్ చిప్ టెక్నాలజీపై చైనా దేశం కన్నేయడమేననేది ప్రచారంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ కంట్రీకి లేని బిప్ సెమీకండక్టర్ ప్రొడక్టివిటీ, సాంకేతికత తైవాన్ దేశానికి ఉంది. అమెరికా కంపెనీలు సైతం తైవాన్ దేశం పై ఆధారపడే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే ఆగస్టు 16, 2025 న చైనా కంపెనీలపై తైవాన్ విచారణ జరిపింది. ఆపిల్ కంపెనీకి చిప్ సరఫరా చేసే గ్రేస్ వాంగ్ (Grace Wang) కంపెనీకి సైతం వారెంట్ జారీ చేయడం గమనార్హం. తాజాగా వన్ ప్లస్ సీఈవోకు వారెంట్ జారీ చేయడం చర్చకు దారితీసింది. కాగా, తైవాన్ వారెంట్‌పై వన్ ప్లస్ కంపెనీ స్పందిస్తూ.. తమ వ్యాపార కలాపాలు ఎప్పటిలాగే కొనసాగుతుందని వెల్లడించింది.