అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk drive | డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిని ఒకరికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద సంతోష్ అనే వ్యక్తి అధికంగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.
అతడికి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) ఎదుట హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి అతడికి ఐదురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. మొదటిసారి డ్రంకన్ డ్రైవ్‌లో దొరికితే రూ.10వేల జరిమానా, రెండోసారి దొరికితే రూ.15వేల వరకు న్యాయస్థానం జరిమానా విధిస్తుందని చెప్పారు.
