30
అక్షరటుడే, బాన్సువాడ : Birkoor Mandal | బీర్కూరు మండలంలోని బరంగేడ్గి (Baramgedgi) గ్రామంలో గురువారం ఉదయం కుక్కలు (Dogs) బీభత్సం సృష్టించాయి. చైనాపురం కామప్ప అనే వ్యక్తిపై దాడి చేశాయి.
కామప్ప ఇంటి వద్ద ఉండగా ఒక్కసారిగా కుక్కల గుంపు దాడి చేసింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి బాధితుడిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రి (Bansuwada Hospital)కి తరలించారు. గ్రామంలో విపరీతంగా కుక్కలు పెరిగిపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
1 comment
[…] (Birkoor) మండలం బైరాపూర్ గ్రామంలో గురువారం […]
Comments are closed.