అక్షరటుడే నిజామాబాద్ క్రైం : Drunken Drive | డ్రంకన్ డ్రైవ్‌లో ఒకరికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (1 Town SHO Raghupathi) వివరాలు వెల్లడించారు.
Drunken Drive | గాంధీ చౌక్ వద్ద..
నగరంలోని గాంధీ చౌక్ (Gandhi Chowk) వద్ద ఈ నెల 8న డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. బ్యాంక్ కాలనీ ఆర్య నగర్‌కు (Arya Nagar) చెందిన దినేష్ అధికంగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుపడ్డాడు. అతడిని సోమవారం స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చారు. అతనికి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం ఎస్‌హెచ్‌వో మాట్లాడుతూ.. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మొదటిసారి తాగి బండి నడిపితే రూ.10,000 జరిమానా లేదా జైలుశిక్ష, రెండోసారి రూ.15000 జరిమానా, జైలు శిక్ష విధించబడతాయని ఆయన తెలిపారు.