39
అక్షరటుడే, మెండోరా: Mendora | బైక్ చోరీ కేసులో (bike theft case) ఒకరిని రిమాండ్ చేశారు. ఈ మేరకు మెండోరా ఎస్సై సుహాసిని (Mendora SI Suhasini) ఆదివారం వివరాలు వెల్లడించారు.
పోచంపాడ్‌కు చెందిన సయ్యద్ ఆజం తన బైక్‌ను మెండోరా మండలంలోని దూద్‌గావ్ గ్రామ శివారులో ఆర్కే ఫంక్షన్ హాల్ సమీపంలో పార్క్ చేశారు. ఈనెల 14వ తేదీన బైక్ చోరీ అయింది. దీంతో బాధితుడు మెండోరా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయిది. ఈ మేరకు విచారణ చేసిన పోలీసులు నిర్మల్‌కు చెందిన షిండే గణేష్ అనే వ్యక్తి చోరీ చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సుహాసిని తెలిపారు.